For Money

Business News

తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

రిటైల్‌ ద్రవ్యోల్బణం జులైలో 6.71 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గినట్లు నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.01 శాతం కాగా, జులైలో స్వల్పంగా తగ్గింది. అయితే గత ఏడాది కాలంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.59 శాతమే. జూన్‌ నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ.. ఆర్‌బీఐ టార్గెట్‌ అయిన 6 శాతానికి పైనే ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. గడిచిన ఏడు నెలలుగా రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే ఉంటోంది. మరోవైపు జూన్‌ నెలలో పారిశ్రామికోత్పత్తి (IIP)12.3 శాతంగా పెరిగింది. గతేడాది జూన్‌లో ఇది 13.8 శాతంగా ఉంది. మాన్యూఫ్యాక్చరింగ్‌ రంగం 12.5 శాతం వృద్ధి చెందడం దీనికి ప్రధాన కారణం. అయితే ఏప్రిల్‌ – జూన్‌లో అంటే తొలి త్రైమాసికంలో ఐఐపీ 12.7 శాతం వృద్ధి చెందింది. కాని గతేడాది ఇదే త్రైమాసికంలో 44.4 శాతం వృద్ది కనబరిచింది. మైనింగ్‌ రంగంలో 7.5 శాతం, విద్యుదుత్పత్తి రంగంలో 16.4 శాతం వృద్ధి నమోదైనట్లు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది.