For Money

Business News

హెరిటేజ్‌ ఫుడ్స్‌ రైట్స్‌ ఇష్యూ?

హైదరాబాద్‌కు చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌ రైట్స్‌ ఇష్యూ చేయాలని నిర్ణయించింది. కంపెనీ విస్తరణ కోసం ఈ నిధులను సమీకరించనున్నట్లు తెలుస్తోంది. నిన్న భేటీ అయిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు రైట్స్‌ ఇష్యూ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 30వ తేదీన భేటీ కావాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో రైట్స్‌ ఇష్యూ ద్వారా ఎంత మొత్తం సమీకరించాలి? ఏ నిష్పత్తిలో షేర్లను జారీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. కంపెనీ షేర్‌ నిన్న బీఎస్‌ఈలో రూ. 319.30 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 1.81 శాతం నష్టంతో ముగిసింది. గత జూన్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 820 కోట్ల టర్నోవర్‌పై రూ. 7.28 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.