For Money

Business News

రీటైల్‌ ద్రవ్యోల్బణం 7.04 శాతం

మే నెలలో రీటైల్‌ ద్రవ్యోల్బణం 7.04 శాతానికి తగ్గింది. ఆర్థిక వేత్తలు అంచనా ప్రకారం 7.1 శాతం  ఉంటుదని భావించారు. ఏప్రిల్‌ నెలలో రీటైల్‌ ద్రవ్యోల్బణం 7.79 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఆహార, ఇంధన ధరల మంట మే నెలలో స్వల్పంగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. గత నెల తొలి వారంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అంచనాల కన్నా ఇంకా నాలుగు శాతం కన్నా (ప్లస్‌ రెండు శాతం) అధిక స్థాయిలో కొనసాగడం వరుసగా నాలుగో వారం. మే నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం కొద్దిగా తగ్గినా..ఆర్‌బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన 6 శాతానికంటే ఇంకా ఎక్కువగానే ఉంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం మించిపోవడం వరుసగా ఇది ఐదో నెల. రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతానికి అటు ఇటుగా 2 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. బియ్యం, గోధుమలు, పంచదార ధరలు స్థిరంగానే ఉన్నా… వంట నూనెలు, కూరగాయల ధరలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.7 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచాన వేసింది.