For Money

Business News

అనిల్‌ అంబానీకి హైకోర్టులో ఊరట

పన్ను ఎగవేత ఆరోపణలపై రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్‌ 17 వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగానికి బాంబే హైకోర్టు సూచించింది. స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.814 కోట్ల మేర లెక్కల్లో చూపని మొత్తం అనిల్‌ ఖాతాలో ఉందని…దానికి సంబంధించి రూ.420 కోట్లు పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఐటీ విభాగం అంలోంది. ఈ మేరకు అనిల్‌ అంబానీకి ఆగస్టు 8న ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖ జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై అనిల్‌ అంబానీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నల్లధన చట్టం.. 2015లో వచ్చిందని, సంబంధిత లావాదేవీలు 2006-2007, 2010-2011 మదింపు సంవత్సరాలకు సంబంధించినవని ఆయన పేర్కొన్నారు. అనిల్‌ అంబానీ, ఐటీ విభాగం తరఫు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను కోర్టు నవంబర్‌ 17కు వాయిదా వేసింది. ఆ తేదీ వరకు షోకాజ్‌ నోటీసుకు సంబంధించి పిటిషనర్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సూచించింది.