For Money

Business News

నిఫ్టికి అండగా రిలయన్స్‌

నవంబర్‌ డెరివేటింగ్స్‌ క్లోజింగ్‌ రోజున నిఫ్టిలో భారీ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. దీనికి తోడు రిలయన్స్‌ నుంచి గట్టి మద్దతు అందింది. గత కొన్ని రోజుల నుంచి నష్టాలతో డల్‌గా ఉన్న రిలయన్స్‌ ఇవాళ జోరుగా ఆరు శాతం పైగా లాభపడింది. దీంతో నిఫ్టి దిగువ స్థాయి నుంచి రెండు వందల పాయింట్లు పెరిగింది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17351ని తాకింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుంటూ వచ్చింది. మిడ్‌ సెషన్‌ తరవాత షార్ట్‌ కవరింగ్‌తో 17,564 పాయింట్లను తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా తగ్గి 17,536 పాయింట్ల వద్ద క్లోజైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 121 పాయింట్లు పెరిగింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి నష్టాలతో ముగిశాయి. కాని మిడ్‌ క్యాప్‌ సూచీ దాదాపు అర శాతం పెరిగింది.