For Money

Business News

స్థిరంగా స్టాక్ మార్కెట్లు

ఇవాళ నవంబర్‌ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17,374కి పడినా వెంటనే కోలుకుని 17.454 పాయింట్లకు చేరింది. కాని నిఫ్టికి తొలి ప్రతిఘటన ఇదే స్థాయి వద్ద ఉంది. ఆల్గో ట్రేడర్స్‌ ఇక్కడ అమ్మకాలకు పాల్పడటంతో ప్రస్తుతం 17,383 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 31 పాయింట్లు నష్టంతో ఉంది. ఇవాళ రిలయన్స్‌ గ్రీన్‌లో ఉండటం విశేషం.నిఫ్టిలో ప్రస్తుతం 33 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్సిషయల్‌ నిఫ్టి అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఫెడ్‌ మినిట్స్‌ బయటికి వచ్చాక… వడ్డీ రేట్ల పెంపు షెడ్యూల్‌లో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టిలో హెచ్చుతగ్గులు ఉన్నా… ట్రెండ్ నిరాశాజనంగా ఉంది. లాభాల్లో ఉన్న షేర్లన్నీ నామ మాత్రపు లాభాల్లో ఉన్నాయి. ఇవాళ అమెరికా మార్కెట్లకు సెలవు కావడంతో మిడ్‌ సెషన్‌ తరవాత కదలికలు జోరుగా అండే అవకాశముంది.