For Money

Business News

ముంబైలో జియో డౌన్‌

ముంబై సర్కిల్‌లో దాదాపు రెండు గంటల నుంచి రిలయన్స్‌ జియో పనిచేయడం లేదు. అనేక మంది వినియోగదారులు ఈ విషయాన్ని సామాజిక మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. రిలయన్స్‌ జియో టు రిలయన్స్‌ జియో మధ్య కాల్స్‌ పనిచేయడం లేదని అంటున్నారు. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియోకు కాల్‌ చేసిన కనెక్ట్‌ కావడం లేదని తెలుస్తోంది. అలాగే బ్రాడ్‌ బ్యాండ్‌ కూడా పనిచేయడం లేదు. ఇతర సర్కిల్స్‌లో జియో పనితీరుపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది. దాదాపు రెండు గంటల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నా కంపెనీ ఇప్పటి వరకు స్పందించలేదు.