For Money

Business News

సైయెంట్‌: రికార్డు లాభాలు

డిసెంబర్‌తో ముగిసిన చివరి త్రైమాసికంలో సైయెంట్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది.2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 39.3 శాతం పెరిగి రూ.110.7 కోట్ల నుంచి రూ.154.2 కోట్లకు చేరింది. గత 12 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక నికర లాభమని సైయెంట్‌ ఎండీ, సీఈఓ కృష్ణ బోదనపు తెలిపారు. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికానికి సైయెంట్‌ ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,093 కోట్ల నుంచి రూ.1,181 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రికార్డు స్థాయి లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఏడాదికి సైయెంట్‌ లాభం 40.6 శాతం వృద్ధితో రూ.371.4 కోట్ల నుంచి రూ.522.4 కోట్లకు చేరింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక లాభం. అలాగే పూర్తి సంవత్సరానికి రూ.4,534 కోట్ల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.2,300 కోట్లకుపైగా విలువైన (టీసీవీ) పెద్ద ఆర్డర్లను సంపాదించింది. డిజిటల్‌ ఆర్డర్లు 50 శాతం పెరగడం కంపెనీ లాభదాయకత, ఆదాయం పెరగడానికి దోహదం చేసిందని కృష్ణ అన్నారు.