For Money

Business News

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్ళు

జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో పెరిగాయి. జులై నెలలో రూ.1.49 లక్షల కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోల్చితే 28 శాతం వృద్ధి నమోదైంది. తాజా వసూళ్లలో సీజీఎస్టీ ద్వారా రూ.25,751 కోట్లు, ఎస్‌జీఎస్టీ ద్వారా రూ.32.807 కోట్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఐజీఎస్టీ కింద రూ.79,518 కోట్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. సెస్సుల రూపంలో మరో రూ.10,920 కోట్లు సమకూరినట్లు కేంద్రం వెల్లడించింది. ఆర్థిక రికవరీ, పన్ను ఎగవేతలు అరికట్టడం వంటి కారణాల వసూళ్లు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. 2021లో జులైలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.16 లక్షల కోట్లు మాత్రమే. 2017లో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రెండో అత్యధిక వసూళ్లు సాధించిన నెలగా ఈ ఏడాది జులై నిలిచింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో సాధించిన రూ. 1.68 లక్షల కోట్లే జీఎస్టీ వసూళ్లలో అత్యధికం. గతేడాది జులై తెలంగాణ రూ.3,610 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా.. ఈ సారి 26 శాతం వృద్ధితో రూ.4,547కోట్లు సాధించినట్లు కేంద్రం తెలిపింది. ఏపీలో కూడా జీఎస్టీ వసూళ్ళు 25 శాతం పెరిగి రూ.2,730 కోట్ల నుంచి రూ.3,409 కోట్లు వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది.