For Money

Business News

కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ పుస్తకాల్లో గోల్‌మాల్

ప్రముఖ హౌసింగ్‌లోన్‌ కంపెనీ కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ వివాదంలో ఇరుక్కుంది. కంపెనీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడ్డారని, పుస్తకాల్లో తప్పుడు లెక్కలు చూపారని ఆరోపణలు వచ్చాయి. సమాచార వేగు ఒకరు నేషనల్‌ హౌసింగ్‌ బోర్డుకు (NHB)ఓ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ ఖాతాలను NHB అధికారులు తనిఖీ చేయగా, మొత్తం 37 ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ మాతృ సంస్థ కెనారా బ్యాంక్‌ కూడా తన కార్యాలయం నుంచి కొంత మంది అధికారులను పంపి… కెన్‌ ఫిన్‌ ఖాతాలను తనిఖీ చేయిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై రిజర్వు బ్యాంకు కూడా దర్యాప్తు ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. ఈ విషయం బయటకుపొక్కడతో కెన్‌ఫిన్‌ హోమ్స్‌ షేర్‌ ఏకంగా రూ. 466.65లకు పడిపోయింది. ఈ షేర్‌ క్రితం ముగింపు 547. ప్రస్తుతం 10 శాతం నష్టంతో రూ. 494 ప్రాంతంలో ట్రేడవుతోంది.