HDFC ట్విన్స్ విలీనానికి ఆర్బీఐ ఓకే
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ విలీనానికి ఆర్బీఐ ఆమోదం లభించింది. ఈ మేరకు ఆర్బీఐ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీంతో ఈ విలీనానికి సంబంధించి ప్రధాన అడ్డంకి తొలగినట్లయింది. ఆమోదం తెలుపుతూనే కొన్ని షరతులను విధిస్తూ ఈనెల 4వ తేదీన ఉత్తర్వులు ఇచ్చినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇప్పటికే ఈ విలీనానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఇంకా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఎన్సీఎల్టీ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదం రావాల్సి ఉంది. హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీనానికి సంబంధించి ఏప్రిల్ 4న ప్రకటన చేసిన విషయం తెలిసిందే.