For Money

Business News

వడ్డీ రేట్లను పెంచకపోవచ్చు… రాయిటర్స్‌ పోల్‌

ఈనెల 9న ప్రకటించనున్న పరపతి విధానం సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని రాయిటర్స్‌ పోల్స్‌లో పాల్గొన్న ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే రివర్స్‌ రెపో రేటును పెంచే అవకాశముందని తెలిపారు. వాస్తవానికి ఈ నెల 8వ తేదీనే ఈ సమీక్ష జరగాల్సింది. గాయని లతా మంగేష్కర్‌ మృతి కారణంగా ఒక రోజు ఆలస్యంగా వెలువడోతంది. మార్కెట్‌లో లిక్విడిటిని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయాలని ఆర్బీఐ భావిస్తోంది. దీంతో ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును (దీనినే రివర్స్‌ రెపో రేటు అంటారు) 3.35 శాతం నుంచి 3.55 శాతానికి పెంచుతారని రాయిటర్స్‌ సర్వే అభిప్రాయపడింది. దీంతో రెపో రేటుకు, రివర్స్‌ రెపో రేటుకు మధ్య వ్యత్యాసం 0.45 శాతానికి తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఏప్రిల్‌లో జరిగే పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 0.25 శాతానికి పెంచే అవకాశముందని రాయిటర్స్‌ సర్వే పేర్కొంది.