For Money

Business News

వడ్డీ రేట్లు 0.25 శాతం పెంపు?

రానున్న పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ 0.20 శాతం లేదా 0.25 శాతం మేర రెపో రేటును పెంచే అవకాశముందని బ్రోకరేజీ సంస్థ బార్కలేస్‌ పేర్కొంది.వచ్చే వారం ఆర్బీఐ ఎంపీసీ సమావేశం కానుంది. రివర్స్‌ రేటు కూడా ఇదే స్థాయిలో పెరుగుతుందని తెలిపింది. ఒమైక్రాన్‌ తరవాత కూడా ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ అధికంగా ఉందని, దీన్ని తగ్గించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరగడం గురించి ప్రస్తావిస్తూ… అసెంబ్లీ ఎన్నికల లోపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచే ఛాన్స్‌ లేదని… అందువల్ల అప్పటి వరకు ద్రవ్యోల్బణం ఇపుడున్న స్థాయిలోనే ఉంటుందని పేర్కొంది.