పావు శాతానికి పరిమితం
భారత రిజర్వు బ్యాంకు రేపు పరపతి విధానాన్ని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. రేపు వడ్డీ రేట్లను కనీసం పావు శాతం పెంచే అవకాశముందని తెలుస్తోంది. రేపు ఉదయం పది గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పరపతి విధాన నిర్ణయాలను ప్రకటిస్తారు. వరుసగా రెండు సార్లు అర శాతం చొప్పున పెంచిన ఆర్బీఐ గత సమావేశంలో 0.35 శాతం మేర వడ్డీ రేటును పెంచింది. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ 2.25 శాతం చొప్పున వడ్డీ రేట్లను పెంచింది. అదే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఇదే కాలంలో 4.5 శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది.