For Money

Business News

నిలకడగా ప్రారంభం

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. సింగపూర్‌ నిఫ్టి 90 పాయింట్ల లాభంతో ఉండగా…నిఫ్టి స్వల్ప లాభాల్లో ప్రారంభమవడమేగాక… కొన్ని క్షణాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 17755ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు 17801 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 37 పాయింట్లు పెరిగింది. నిఫ్టి ప్రస్తుతం 34 షేర్లు లాభాల్లో ఉన్నాయి. చాలా వరకు అదానీ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ పోర్ట్స్‌ నాలుగు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి నెక్ట్స్ గ్రీన్‌లో ఉండటానికి అదానీ షేర్లే ప్రధాన కారణం. అదానీ ట్రాన్స్‌తో పాటు అంబుజా సిమెంట్ లాభాల్లో ఉన్నాయి.