For Money

Business News

పెట్టుబడి ప్రతిపాదనలకు ఓకే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో దిగువ పేర్కొన్న పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
1. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా ఫుడ్స్‌ కంపెనీ ప్రతిపాదనకు ఆమోదం. ఎంపీ వల్లభనేని బాలశౌరి కుటుంబానికి చెందిన ఈ కంపెనీ రూ.498.84 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వచ్చే ఏడాది జూన్‌ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి కావొచ్చు.
2. కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్‌
రూ. 3,400 కోట్లతో చేపట్టే విస్తరణ ప్రాజెక్టు కూడా ఆమోదం. ప్రత్యక్షంగా 2,100 మందికి ఉద్యోగాలు లభించే అవకాశముంది.
3.ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు నెలకొల్పుతారు. మొదటి విడతలో రూ.55వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు అంటే వెరశి మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి పెడతారు.
4. శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్ కంపెనీ రెండు ఫ్యాక్టరీలు నెలకొల్పనుంది. వీటిలో డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్ తయారీ చేపడతారు. శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్లతో.. పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడితో ఈ ప్లాంట్లు నెలకొల్పుతారు.
5. రామాయపట్నంలో రూ. 10వేల కోట్ల పెట్టుబడితో కాపర్‌ కాథోడ్, కాపర్‌ రాడ్, సల్ఫూరిక్‌ యాసిడ్‌, సెలీనియం, ప్రత్యేక ఖనిజాల తయారీ యూనిట్‌ను అకార్డ్‌ గ్రూప్‌ నెలకొల్పుతుంది.
6. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ రూ.10,500 కోట్ల పెట్టుబడితో విండ్, సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు నెలకొల్పుతుంది.
7. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ను అదానీ గ్రూప్‌నకు చెందిన వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ నెలకొల్పనుంది.
8. వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు తిరుపతి వద్ద ప్లాంట్‌ ఉంది. దీన్ని రూ. 1489.23కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నారు.
9. భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది.