For Money

Business News

వాటికి పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ లైసెన్స్‌?

పలు కంపెనీలకు పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ లైసెన్స్‌ను ఆర్బీఐ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో రేజర్‌ పే, పైన్‌ ల్యాబ్స్‌ కూడా ఉన్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ వెల్లడించింది. పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసిన కంపెనీలు ఆర్బీఐ వద్ద ప్రజంటేషన్స్‌ ఇచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన ఆర్బీఐ త్వరలోనే పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ లైసెన్స్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.2020 మార్చిలో పేమెంట్‌ అగ్రిగేటర్స్‌ మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. మర్చంట్స్‌ నుంచి పేమెంట్‌ సర్వీసులు తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా ఆర్బీఐ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు ప్రకారం వీటి అజమాయిషి పూర్తిగా ఆర్బీఐ చేతిలో ఉంటుంది.