రేపు వడ్డీ రేట్ల పెంపు ఖాయం
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. ఈ సందర్భంగా వడ్డీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ గమనంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. రేపు రెపో రేట్లను ఆర్బీఐ పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. ఏ మేరకు పెంచుతారనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 0.35 శాతం నుంచి 0.50 శాతం మధ్య వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సీఎన్‌బీఐ టీవీ 18 ఛానల్ నిర్వహించిన సర్వేలో బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. డిసెంబర్ కల్లా రెపో రేటు 5.75 శాతం నుంచి 6 శాతం వరకు పెరిగే అవకాశముందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అధిక ధరలను కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.