For Money

Business News

బులియన్‌ మార్కెట్‌లో ర్యాలీ

డాలర్‌ స్థిరంగా ఉన్నా… బులియన్‌ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 104 వద్ద ఉండగా, ఔన్స్‌ బంగారం ధర 2086 డాలర్ల వద్ద ఉంటుంది. అలాగే వెండి ధర 23.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రెండు మెటల్స్‌ 1.5 శాతం లాభపడ్డాయి. దీంతో మన మార్కెట్‌లో కూడా బులియన్‌ ర్యాలీ కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌లో పదిగ్రామలు స్టాండర్డ్‌ బంగారం ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ రూ. 745 పెరిగి రూ. 63,313 వద్ద ట్రేడవుతోంది. అలాగే సిల్వర్‌ కిలో ధర రూ. 911 పెరిగి రూ. 72,190 వద్ద ట్రేడవుతోంది.