For Money

Business News

గ్రీన్‌లో వాల్‌స్ట్రీట్‌

వాల్‌స్ట్రీట్‌లో ఇవాళ కూడా మార్కెట్లు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. మూడు ప్రధాన సూచీలు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా నాస్‌డాక్‌ 0.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఏఐ డిమాండ్‌తో ఇవాళ డెల్‌ కంపెనీ షేర్లు కూడా భారీ లాభాలతో ట్రేడవుతోంది. తాజా సమాచారం మేరకు డెల్‌ షేర్లు 25 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఎలక్ట్రిక్‌ కారు ప్రాజెక్టును ఆపేస్తున్న యాపిల్‌ ప్రకటించడంతో ఆ షేర్ స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. మరోవైపు డాలర్‌ ఇండెక్స్ 104 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర మళ్ళీ 84 డాలర్లను దాటింది.