For Money

Business News

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకి ఐటీ అవార్డు

త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్‌గా పేరొందిన న‌టుడు ర‌జినీకాంత్‌కు అవార్డులు కొత్త కాదు. ఇప్పటికీ ఎన్నో రకాల అవార్డులు అందుకున్నారు. కాని ఈసారి ఆయనకు భిన్నమైన అవార్డు లభించింది.త‌మిళ‌నాడు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం ప‌న్ను చెల్లించిన వ్యక్తిగా ర‌జనీకాంత్ నిలిచారు. అందుకు గౌర‌వంగా ఆయ‌న‌కు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగం అధికారులు అవార్డు ప్రదానం చేశారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డే సంద‌ర్భంగా చెన్నైలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ త‌మిళ‌సై ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ర‌జ‌నీకాంత్‌తోపాటు ప‌లువురు ప్రముఖుల‌కు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ర‌జ‌నీకాంత్ త‌ర‌పున ఆయ‌న కుమార్తె ఐశ్వర్య ఈ అవార్డును అందుకున్నారు.