For Money

Business News

BULL SPREAD: L&T షేర్‌ వ్యూహం

సూచీల్లో మార్పు చాలా తక్కువగా ఉన్నపుడు ఇన్వెస్టర్లు రిటర్న్‌ల కోసం ఇతర వ్యూహాలను ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది ఆప్షన్స్‌లో ట్రేడ్‌ చేయడానికి కారణం ఇదే. కాని సక్సెస్‌ఫుల్‌ స్ప్రెడ్‌ సెట్‌ చేయడం చాలా మందికి రాదు. అందుకే ప్రముఖ అనలిస్టులు తయారు చేసిన స్ప్రెడ్‌ను అనుసరిస్తుంటారు. అలాంటి బుల్‌ స్ప్రెడ్‌ ఇక్కడ ఇస్తున్నాం. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ఇచ్చిన స్ట్రాటజీ ఇది. ఎల్‌ అండ్‌ టీ షేర్‌పై ఇది బుల్‌ స్ప్రెడ్‌. ఎలా? ఎందుకు పనిచేస్తుందో ఆయన వివరించారు.
బుల్‌ స్ప్రెడ్‌ :
ఎల్‌ అండ్‌ టీ షేర్‌లో 28 జులై- రూ.1760 కాల్‌ను రూ. 25.30 వద్ద కొనుగోలు చేసి… ఇదే షేర్‌లో రూ.1800 -28 జులై కాల్‌ను రూ. 11.30 వద్ద అమ్మమని ఆయన సలహా ఇస్తున్నారు. ఈ లాట్‌ సైజ్‌ : 300

ఈ వ్యూహం మీరు అమలు పర్చాలంటే మీ వద్ద ఉండాల్సిన పెట్టుబడి రూ. 4200 (రూ.14X300). ఇదెలాగంటే రూ. 25.30లకు కొంటూనే రూ.11.30కి అమ్ముతాము కాబట్టి…నికర పెట్టుబడి కాల్‌కు రూ. 4,200 అవుతుంది.

జులై 28వ తేదీన ఎల్‌ అండ్‌ టీ షేర్‌ గనుక రూ.1800 స్థాయిని దాటితే లాభం రూ. 7800.
ఈ షేర్‌ రూ.1774కు చేరినా… మీరు లాభనష్టాలు లేని స్థాయికి వచ్చేస్తారు.
రిస్క్‌ వొద్దనుకునేవారు రూ.1774కు వస్తే బయట పడొచ్చు. లేదా మీ రిస్క్‌ను బట్టి స్టాప్‌లాస్‌ పెట్టుకోవచ్చు.

ఈ స్ప్రెడ్‌ వెనుక వ్యూహం:
– ఎల్‌ అండ్‌ టీ షేర్‌లో గత గురువారం లాంగ్‌ బిల్డప్‌ కనిపించింది. ధర 2.7 శాతం పెరగడంతో పాటు ఓపెన్‌ ఇంటరెస్ట్‌ కూడా 12 శాతం పెరిగింది.
– ఈ ఏడాది 11 ఏప్రిల్‌ తేదీ నుంచి డైలీ చార్ట్‌ను గమనిస్తే ఈ షేర్‌ ఇపుడు అత్యధిక ధరను క్రాస్‌ చేసింది.
– ఆర్‌ఎస్‌ఐ (11), ఎంఎఫ్‌ఐ (10)లు కూడా ప్రస్తుత ట్రెండ్‌కు బలాన్ని సూచిస్తున్నాయి.