For Money

Business News

27 నుంచి రెయిన్‌బో ఐపీవో

హైదరాబాద్‌లోని చిన్న పిల్లల ఆసుపత్రుల నిర్వహణ సంస్థ రెయిన్‌బో చిల్డ్రన్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఇష్యూ 29న ముగుస్తుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఈ కంపెనీ 2.4 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తోంది. ఇందులో 50 శాతం షేరర్లు క్యూఐపీ కింద ఆఫర్‌ చేస్తుండగా, రీటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లు ఆఫర్‌ చేస్తారు. చాలా వరకు షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు అమ్ముకుంటుండగా, కొత్త షేరర్ల జారీ ద్వారా ద్వారా రూ. 280 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ ప్రమోటైర్లెన రమేశ్‌ కంచర్ల, దినేశ్‌ కుమార్‌ చీర్లా, ఆదర్శ్‌ కంచర్ల, పద్మ కంచర్ల, ఇన్వెస్టర్‌ బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, సీడీసీ ఇండియాకు చెందిన షేర్లను విక్రయించనున్నారు. అర్హులైన ఉద్యోగులకు 3 లక్షల షేర్లను కేటాయించింది సంస్థ. ప్రస్తుతం కంపెనీకి 14 ఆసుపత్రులు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. షేర్ల లిస్టింగ్‌ మే 10వ తేదీన జరుగుతుంది.