For Money

Business News

ట్విటర్‌ షేర్ల కోసం టెండర్ ఆఫర్‌‌?

ట్విటర్‌ బోర్డు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ట్విటర్‌ వాటాదారుల నుంచి నేరుగా షేర్లు కొనేందుకు టెండర్‌ ఆఫర్‌ చేసే అంశాన్ని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ పరిశీలిస్తున్నారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలకు మస్క్‌ తెలిపారు. ట్విటర్‌ మొత్తం షేర్లను లేదా పాక్షింగా కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు మస్క్‌ తెలిపారు. దీనికి అవసరమైన మొత్తం 4650 కోట్ల డాలర్ల నిధులను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మోర్గాన్‌ స్టాన్లీ సీనియర్‌ ఫండింగ్‌, ఇతర సంస్థల ద్వారా 2550 కోట్ల డాలర్ల రుణ సమీకరణకు ఆమోదం పొందినట్లు తన సమాధానంలో మస్క్‌ తెలిపారు. మిగిలిన 2100 కోట్ల డాలర్లను ఈక్విటీ ఫైనాన్సింగ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిధుల సమీకరణలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, బార్క్‌లేస్‌, MUFG, సొసైటీ జనరల్‌, మిజువొబ్యాంక్‌, బీఎన్‌పీ పారిబస్‌లు పాల్గొంటున్నట్లు మస్క్‌ తెలిపారు. టెండర్‌ ఆఫర్‌పై మస్క్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మస్క్‌ ప్రతిపాదన తమకు అందిందని ట్విటర్‌ పేర్కొంది. అంతకుమించి స్పందించేందుకు నిరాకరించింది.