For Money

Business News

క్రిప్టో కరెన్సీదే భవిష్యత్తు

క్రిప్టో క‌రెన్సీని భ‌విష్యత్ క‌రెన్సీ అని అధిక రిస్క్‌ ఉన్నా… ప్రతి ఇన్వెస్టర్ వద్ద ఉండాల్సిన కరెన్సీ అని ‘కాయిన్ స్విచ్’ సీఈవో ఆశిష్ సింఘాల్ అన్నారు. మనదేశంలో క్రిప్టోలను అందించే స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో కాయిన్‌ స్విచ్‌. టైమ్స్ నెట్‌వ‌ర్క్ నిర్వహించిన ‘ఇండియా ఎక‌న‌మిక్ కాంక్లేవ్‌’లో ఆయన మాట్లాడారు. 15 ఏళ్ళ క్రితం ఇంట‌ర్నెట్ కంపెనీ ప్రారంభించాలంటే ఎక్కడి నుంచో సర్వర్‌లు తెప్పించాల్సి వచ్చేది.. మీ గ్యారేజీలో.. ఇంకో చోటో వాటిని పెట్టాల్సి వచ్చేది. ఇపుడు వెబ్‌3 రాకతో బ్లాక్‌చైన్ టెక్నాల‌జీ పుణ్యమా అని మ‌న ఫోన్లు, లాప్‌టాప్‌లతోనే చేస్తున్నామని అన్నారు. గ‌త రెండేళ్ళలో త‌మ క్రిప్టో ఎక్స్చేంజ్‌లో 1.8 కోట్ల మందికి పైగా స‌భ్యులయ్యార‌ని ఆశిష్ సింఘాల్ అన్నారు.