For Money

Business News

లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య… అంచనా వేసినవారి కంటే తక్కువగా ఉంది. ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు అంచనాలను మించి లాభాలు చూపాయి. టెస్లా ఫలితాలు అదరగొట్టాయి. ఈ వార్తల నేపథ్యంలో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500, డౌజోన్స్‌ సూచీలు అర శాతంపైగా లాభాలతో ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఆ స్థాయి లాభాలు లేకపోవడానికి ప్రధాన కారణం బాండ్‌ ఈల్డ్స్‌ ఇవాళ అనూహ్యంగా పెరగడం. నెట్‌ప్లిక్స్‌ షేర్‌ నిన్న 35 శాతం క్షీణించగా… ఇవాళ మరో 5 శాతం తగ్గింది. డాలర్‌ కూడా స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ ఇదే లాభాలను కొనసాగిస్తుందా..లేదా అన్నది చూడాలి.