For Money

Business News

నేటి నుంచి రెయిన్‌బో పబ్లిక్‌ ఇష్యూ

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇష్యూ 29న ముగుస్తుంది. ఇష్యూ ద్వారా మొత్తం రూ.1,581 కోట్ల నిధులను సమీకరించాలని రెయిన్‌బో భావిస్తోంది. ఇందులో రూ.280 కోట్లను కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా పొందనుంది. మిగిలిన మొత్తం ఇపుడున్న ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు తమ షేర్లను అమ్మనున్నారు. ఒక్కో షేర్‌ ధర శ్రేణిని రూ.516-542గా నిర్ణయించారు. మంగళవారం నాడు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.470 కోట్లు సమీకరించింది. వీరికి 86.63 లక్షల షేర్లను కేటాయించింది. ఒక్కోషేర్‌ను రూ. 542కు కేటాయించింది. మొత్తం 36 సంస్థలు ఈ షేర్లను కొనుగోలు చేయగా, అత్యదికంగా సింగపూర్‌ ప్రభుత్వం 6.53 లక్షల షేర్లను కొనుగోలు చేసింది.