For Money

Business News

భారీ నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

రేపు వీక్లీ, డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ నేపథ్యంలో భారత మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి ఎదురు కానుంది. రాత్రి అమెరికా మార్కెట్ల భారీ నష్టాల నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా దాదాపు 200 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి 17000 దిగువన ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. డాలర్‌ క్రమంగా బలపడుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ 102ను దాటింది. రష్యా, యూరప్‌ దేశాల మధ్య ఆయిల్‌ సరఫరాకు సంబంధించి తాజా గొడవలు మొదలయ్యాయి. దీంతో క్రూడ్‌ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్‌ 105 డాలర్లను దాటింది. ఈ నేపథ్యంలో భారత కంపెనీలోపై ఒత్తిడి అధికమౌతోంది. మరోవైపు అమెరికా మార్కెట్ల ప్రభావం ఆసియా మార్కెట్లలో కన్పిస్తోంది. జపాన్‌ నిక్కీ రెండు శాతం నష్టపోయింది. తైవాన్‌ నష్టాలు రెండు శాతం దాటాయి. న్యూజిల్యాండ్ నష్టాలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. చైనా స్థిరంగా ఉండగా, హాంగ్‌సెంగ్‌ 0.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి ట్రెండ్‌ చూస్తుంటే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17000 స్థాయిని కోల్పోవడం ఖాయంగా కన్పిస్తోంది.