For Money

Business News

ఒక శాతంపైగా లాభపడిన సూచీలు

ఉదయం నుంచి ఫ్యూచర్స్‌ మార్గంలోనే వాల్‌స్ట్రీట్‌ ప్రారంభమైంది. మూడు ప్రధాన సూచీలు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌, వీసా ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు మించడంతో ఈ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. గూగుల్‌ పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో ఆ కంపెనీ షేర్లు డల్‌గా ఉన్నాయి. ప్రధాన కంపెనీల్లో ఒక్క గూగుల్‌ షేర్‌ మాత్రమే రెడ్‌లో ఉంది. మైక్రోసాఫ్ట్‌ షేర్‌ 7 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిన్నటి దాకా బాగా పడిన టెస్లా ఇవాళ రెండున్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. అమెరికా పదేళ్ళ ట్రజరీ బాండ్‌ ఈల్డ్స్‌ స్వల్పంగా పెరిగినా మార్కెట్‌ పట్టించుకోలేదు. డాలర్ పరుగు ఆగడం లేదు. డాలర్‌ ఇండెక్స్‌ 102.83ని చేరింది. ఎకనామీ షేర్లు కూడా బాగుండటంతో డౌజోన్స్‌ ఏకంగా 1.7 శాతం లాభంతో ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ సూచీలు 1.27 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.