బైజూస్‌కు మరో భారీ షాక్
మరో వంద కోట్ల డాలర్లను మార్కెట్ నుంచి సమీకరించాలని భావిస్తున్న ఎడుటెక్ సంస్థకు మరో భారీ షాక్ తగిలింది. కంపెనీలో నాన్ ప్రమోటర్లలో అత్యధిక వాటా కలిగిన ప్రొసస్ కంపెనీ సంచలన విషయాలను బయటపడింది. తన వార్షిక నివేదికలో బైజూస్ వ్యాల్యుయేషన్‌ను 510 కోట్లకు తగ్గింది. గత ఏడాదిలో భారీ ఎత్తున నిధులు సమీకరించిన బైజూస్ కంపెనీ…తన వ్యాల్యూయేషన్ 2,200 కోట్ల డాలర్లుగా పేర్కొంది. అయితే గత ఏడాది కంపెనీ విలువ భారీగా క్షీణించింది. కంపెనీ అకౌంట్స్‌పై అనుమానాలు వ్యక్తం కావడంతో పాటు కంపెనీని నుంచి కీలక డైరెక్టర్లు రాజీనామా చేయడంతో బైజూస్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పీక్ XV పార్ట్నర్స్, ఛాన్ జూకర్బర్గ్ (ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జూకర్బర్గ్ భార్య)తో పాటు ప్రొసస్ కంపెనీకి బైజూస్‌లో అధిక వాటా ఉంది. ఈ మూడు కంపెనీల డైరెక్టర్లు ఇటీవలే బైజూస్ నుంచి రాజీనామా చేశారు. ముఖ్యంగా ప్రొసస్కు 9.6 శాతం వాటా ఉంది. తాజాగా ఈ వాటా విలువ 49.30 కోట్ల డాలర్లుగా ప్రొసస్ పేర్కొంది. ఈ లెక్కన బైజూస్ విలువ 510 కోట్ల డాలర్లేనని తేలింది. గడచిన 18 నెలల్లో బైజూస్ వ్యాల్యుయేషన్ దారుణంగా పడిపోయింది.