For Money

Business News

ఎట్టకేలకు టెక్‌ షేర్ల హవా

గత కొన్ని రోజులుగా నష్టాలతో ట్రేడవుతున్న టెక్‌, ఐటీ షేర్లకు ఇవాళ ఊరట లభించింది. గత వారంలో డౌజోన్స్ స్థిరంగా ఉన్నా… నాస్‌డాక్‌ భారీగా నష్టపోతూ వచ్చింది. ఇవాళ నాస్‌డాక్‌ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని టెక్‌, ఐటీ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. మెటా 3 శాతం దాకా లాభపడింది. మైక్రోసాఫ్ట్‌ షేర్‌లో మాత్రం పెద్దగా కదలికలు లేవు. యాపిల్‌, టెస్లా, అమెజాన్‌, ఏఎండీ షేర్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్‌ కూడా అర శాతం దాకా లాభపడింది. డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా క్షీణించడంతో… దాని ప్రభావం ఈక్విటీ, బులియన్‌ మార్కెట్‌పై కన్పిస్తోంది. అయితే డాలర్‌ క్షీణించినా క్రూడ్‌ ధరలు తగ్గడం విశేషం. బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే బులియన్‌ మార్కెట్‌పై డాలర్‌ ప్రభావం ప్రతికూలంగా ఉంది. వెండి అర శాతం పెరగ్గా, బంగారం ధరలు మాత్రం క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం ధర అమెరికా మార్కెట్‌లో 1924 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.