For Money

Business News

చివర్లో అమ్మకాల ఒత్తిడి

కొత్త రికార్డులు సృష్టించిన నిఫ్టికి మిడ్‌ సెషన్‌ తరవాత వచ్చిన ఒత్తిడితో మళ్ళీ 18000 దిగువన క్లోజైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల లాభంతో నిఫ్టి 17,945 వద్ద ముగిసింది. అంతకుమునుపు ఉదయం 17,839 పాయింట్ల కనిష్ఠ స్థాయికి తాకిన నిఫ్టి ఏకంగా 200 పాయింట్లు పెరిగి 18042 పాయింట్లకు చేరింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్‌ నిరాశపర్చింది. శుక్రవారం అమెరికా మార్కెట్‌ నష్టాల్లో ముగియడం, ఇవాళ కూడా ఫ్యూచర్స్‌ రెడ్‌లో ఉండటంతో ఇన్వెస్టర్లు అధిక స్థాయి వద్ద లాభాలు స్వీకరించారు. నిఫ్టి ఇండెక్స్‌ 3.36 శాతం క్షీణించింది. దీంతో బ్యాంక్‌ నిఫ్టి 1.37 శాతం పెరిగినా… నిఫ్టి గరిష్ఠ స్థాయి వద్ద ఉంలేకపోయింది. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం 0.74 శాతం లాభంతో క్లోజ్‌ కావడం మరో విశేషం. టీసీఎస్‌ ఆరు శాతంపైగా నష్టంతో ముగిసింది. టాటా మోటార్స్‌ 9 శాతంపైగా లాభపడింది.