For Money

Business News

అమెజాన్‌ షేర్ 20 శాతం డౌన్‌

అమెరికాలో ఐటీ, టెక్‌ షేర్లలో ఉన్న కోవిడ్ కొవ్వు కరిగిపోతోంది. కోవిడ్‌ తరవాత జనం భారీగా ఐటీ, టెక్‌ సేవలు బాగా వినియోగించడంతో వీటి షేర్లు భారీగా పెరిగాయి. అపుడు ప్రభుత్వాలు కూడా భారీగా ఆర్థిక సాయం చేశాయి. దీంతో కొనుగోళ్ళు పెరిగి… ద్రవ్యోల్బణం పెరిగింది. ఇపుడు ధరలను కంట్రోల్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీని ప్రభావం ఇపుడు కంపెనీలపై పడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ దారుణంగా దెబ్బతింది. ఆ తరవాత నిన్న మైక్రోసాఫ్ట్‌. గూగుల్‌. మెటా షేర్లు 25 శాతం పడ్డాయి. ఇవాళ అమెజాన్‌ 20 శాతం క్షీణించింది. . ఫలితాలు మార్కెట్‌ తరవాత వచ్చాయి. దీంతో అనధికారిక మార్కెట్‌లో ఈ షేర్‌ 20 శాతం పైగా పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో అమెజాన్‌ 12710 కోట్ల డాలర్ల టర్నోవర్‌ను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 290 కోట్ల నికర లాభం ప్రకటించింది. కంపెనీ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో భారీగా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. చిత్రంగా సాలిడ్‌ కంపెనీల ఒక్కో షేర్‌ ఐస్‌ ముక్కలా కరిగిపోతోంది. ముఖ్యంగా మెటా పడితీరు ఇన్వెస్టర్లకు జ్వరం తెప్పిచింది. ఇపుడు అమెజాన్‌ కూడా 20 శాతంపైగా క్షీణించి షేర్‌ ధర 96 డారల్లకు పడింది. కొన్ని నెలల క్రితం ఈ షేర్‌ 146 డాలర్ల ప్రాంతంలో ఉండేది.