For Money

Business News

జాగ్రత్త… రిస్క్‌ తీసుకోవద్దు..

అంతర్జాతీయ మార్కెట్లలో చైనా, అమెరికా మార్కెట్లలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే చైనా… ఆన్‌లైన్‌ బిజిన్‌ బూమ్‌ను బద్ధలు కొట్టింది. కేవలం స్కూల్‌ పాఠాలను వీడియోలుగా తీసి కొన్ని వేల కోట్లు సంపాదించిన కంపెనీలకు చైనా షాక్‌ ఇచ్చింది. అనేక బుడగలను పేల్చేసింది. అలాగే రియల్‌ ఎస్టేట్‌పైనా. ఇలా అనేక రంగాల్లో పెరిగిపోతున్న ‘అతి’కి చైనా బ్రేక్ వేసింది. అమెరికా మార్కెట్లలో కూడా ఇదే జరుగుతోంది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ ప్రమేయం లేదు. కరోనా సమయంలో భారీగా పెరిగిన అనేక కంపెనీల షేర్లు ఇపుడు ‘వాస్తవ’ ధరల వద్దుకు వస్తున్నాయి. అయితే మార్కెట్‌ ప్రవర్తిస్తున్న తీరు ఇన్వెస్టర్లను కంగారు పెడుతోంది. నెట్‌ప్లిక్స్‌ నుంచి మెటా వరకు అనేక షేర్లు ఏకంగా ఒకే రోజు 20 నుంచి 25 శాతం పడటం ఇన్వెస్టర్లకు షాక్‌ గురి చేస్తోంది. అమెజాన్‌ కూడా 20 శాతంపైగా పడటంతో ఈక్విటీ మార్కెట్లలో ఎన్నడూ లేని భయం కన్పిస్తోంది. వడ్డీ రేట్లు పెరిగినా… ద్రవ్యోల్బణం తగ్గడం లేదు. దీంతో ఫెడరల్‌ బ్యాంక్‌ మరింతగా వడ్డీ రేట్లను పెంచనుంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. దీంతో నవంబర్‌ 1,2 తేదీలలో ఫెడ్‌ భేటీ కానుంది. ఫెడ్‌ నిర్ణయం తరవాత నంబర్‌ 3న మన దేశంలో ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్‌ జరుగనుంది. ఇది అత్యవసర సమావేశం. మార్కెట్‌లో ధరలు ఇంకా అధిక స్థాయిలో ఉండటంతో మోడీ ప్రభుత్వాన్ని కలవర పరుస్తోంది. ముఖ్యంగా ఆహార వస్తువుల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏం చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారింది. లక్షల కోట్లను ప్రొవిజనింగ్‌ చేసిన బ్యాంకులు ఇపుడు కాస్త లాభదాయకంగా కన్పిస్తున్నాయి. ఇతర పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనం ఎన్నడూ లేనంతగా క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారు. అంటే తాత్కాలిక అప్పులను ఆశ్రయిస్తున్నారు. ఇవన్నీ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు హెచ్చరికలు. కాబట్టి షేర్లలో భారీగా పెట్టుబడి పెట్టకండి. డే ట్రేడర్స్‌ కూడా చాలా జాగ్రత్తగా చాలా తక్కువ స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయండి. 17500 స్థాయి దిగువకు నిఫ్టి వెళితే చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండండి. ఆర్బీఐ పరపతి విధాన సమావేశం తరవాత మళ్ళీ వ్యూహాన్ని తయారు చేసుకోండి. పైకి సూచీలు గ్రీన్‌లో వందల పాయిట్లు పెరుగుతున్నా… షేర్ల ధరలు తగ్గుతున్నాయి. మరో కీలక అంశం. ఈ ఏడాది ఇప్పటి వరకు నిఫ్టి పెరిగింది కేవలం ఒక శాతం మాత్రమే. జనవరి 1వ తేదీన నిఫ్టి 17625 పాయింట్లు ఉండగా ఇవాళ 17782 మాత్రమే. సో… లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లకు దక్కింది చాలా తక్కువ. డే ట్రేడర్స్‌, పొజిషనల్‌ ట్రేడర్స్‌ కూడా 17500 పాయింట్లను దృష్టిలో పెట్టుకుని ట్రేడ్‌ చేయండి.