For Money

Business News

రూ.25 నుంచి రూ. 60

కొన్నినెలల పాటు రేటు లేక ఇబ్బంది పడిన ఉల్లి రైతుకు ఇపుడు కాస్త ధర వస్తోంది. అయితే అనూహ్యంగా ఒకే నెలలో ఉల్లి ధరలు భారీగా పెరగడం మార్కెట్‌ను ఆశ్చరుస్తోంది. క్రమంగా వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఇపుడు కన్పిస్తోంది. నెల రోజుల్లో చక్కెర ధర రూ.45 నుంచి రూ. 65కు పెరగ్గా, ఇపుడు నెల రోజుల క్రితం రూ. 25 ఉన్న ఉల్లి రూ. 60లకు చేరింది. ఏపీలోని పలు పట్టణాల్లో ఉల్లి ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉంటోంది. హోల్‌సేల్‌ మార్కెట్లయిన నాసిక్‌, షోలాపూర్‌లో పది కిలోల ఉల్లి సంచి రూ. 500పైనే ఉంటుందోని వార్తలు వస్తున్నాయి. ఈసారి కర్నూలు నుంచి పంట దిగుబడి ఆలస్యం కావడం కూడా ధరలు భారీగా పెరగడానికి కారణమని వ్యాపారస్తులు అంటున్నారు. పంట విస్తీర్ణం తగ్గకపోయినా… పంట దిగుబడి ఏమాత్రం తగ్గుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా చోట్ల పంట ఆలస్యంగా వేశారని, దీంతో దిగుబడిపై సరైన అంచనా లేదని అంటున్నారు. ఇపుడు చాలా మంది మహారాష్ట్ర మార్కెట్‌పై ఆధారపడుతున్నారు. మహారాష్ట్రలో ఈసారి పంట దిగుబడిలో మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే ఏపీ నుంచి దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో తక్కువ క్వాలిటీ ఉన్న ఉల్లి రూ. 40లకు లభిస్తోంది. అదే క్వాలిటీ ఉన్న ఉల్లి ధర మాత్రం రూ. 50పైనే ఉంది.

Leave a Reply