కెనడాపై 50 శాతం టారిఫ్
కెనడాతో వాణిజ్య చర్చలను అమెరికా రద్దు చేసింది. కెనడా వస్తువులపై 50 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాదాపు 2000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులపై టారిఫ్ పడనుంది. అయితే క్రూడ్ వంటి కీలక వస్తువులను మినహాయించారు. అయితే అమెరికా చర్యలపై కెనడా వెంటనే స్పందించింది. తాము కూడా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి అమెరికా వస్తువులపై టారిఫ్ విధిస్తామని వెల్లడించింది. తమ దేశ కార్మికులు, ప్రజలు, వ్యాపార సంస్థల ప్రయోజనాల దృష్ట్యా … తాము కూడా 2000 కోట్ల విలువైన అమెరికా వస్తువులపై టారిఫ్ విధిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నే వెల్లడించారు. అమెరికా స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులపై కెనడా టారిఫ్ విధించే అవకాశముంది. తొలి నుంచి వాణిజ్య విషయంలో అమెరికా విధానాలను కెనడా వ్యతిరేకిస్తూ వస్తోంది. తన అవసరాల్లో 70 శాతం అమెరికా వస్తువులపై కెనడా ఆధాకపడి ఉంది. అయినా కార్నే మాత్రం అమెరికా వాణిజ్య విధానాలపై చాలా గట్టిగా పోరాడుతున్నారు.
