మళ్ళీ హువాంగ్… షేర్ 35% జంప్
ఎన్‌విడియా (Nvidia) కంపెనీసీఈఓగా జెన్సన్ హువాంగ్ మళ్ళీ నియమితులు అయ్యారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కంపెనీ బోర్డు ఆమోదించింది. ఈ విషయం తెలిసిన వెంటనే కంపెనీ షేర్ ఏకంగా 30 శాతం పెరిగింది. ఎన్విడియాతో పాటు డెల్ 24 శాతం, బ్లూమ్ ఎనర్జి 23 శాతం పెరిగింది. టీఎస్‌ఎం 17 శాతం, ఒరాకిల్ షేర్ 15 శాతం, కోహెరెంట్ 20 శాతొ చొప్పున పెరిగాయి. అలాగేమైక్రాన్ టెక్నాలజీస్ 14 శాతం, కోర్‌వీవ్ 29 శాతం, ఏఎండీ షేర్లు 9 శాతం చొప్పున దూసుకెళ్లాయి. చైనా గర్ల్‌ఫ్రెండ్ ద్వారా విదేశీ గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జెన్సన్ హువాంగ్‌ను కంపెనీ సీఈఓగా తొలగించారు. దీంతో కంపెనీ షేర్ 243 డాలర్ల నుంచి 125.5 డాలర్లకు పడిపోయింది. తాజా వార్తతో 35.51 శాతం పెరిగి రూ. 170.16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్ ఏకంగా 7.93 శాతం పెరగ్గా, ఎస్ అండ్ పీ 500 షేర్ 5.5 శాతం పెరిగింది. ఎకానమీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్ 3.4 శాతంపైగా లాభపడింది.
