అమర రాజాకు ‘చైనా’ కష్టాలు
తెలంగాణలో అమరరాజా ఎనర్జి అండ్ మొబిలిటీ కంపెనీ కొత్తగా ప్రారంభించిన ప్లాంట్‌కు చైనా కష్టాలు ప్రారంభమయ్యాయి. లీథియం ఐరన్ ఫాస్పేట్ (LEF) సెల్ టెక్నాజలీ కోసం 2024లో చైనా కంపెనీ గోషన్ హైటెక్ (Gotion High Tech)తో ఒప్పందం చేసుకుంది. అంతా ఫాస్ట్‌గా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో చైనా టెక్నాలజీ ఒప్పందాలకు బ్రేక్ పడింది. వీటిపై చైనా నిషేధం విధించింది. ఇదే సమయంలో చైనా కంపెనీతో ఎక్సైడ్ ఇంస్ట్రీస్ కూడా ఒప్పందం చేసుకుంది. తన బెంగళూరు ప్లాంట్‌ను జెట్ స్పీడ్‌తో ఎక్సైడ్ పూర్తి చేసేసింది. దీంతో ఇపుడు ఎక్సైడ్ LVF, LEP ప్లాంట్ ఉత్పత్తికి రెడీ అయింది. అయితే సకాలంలో అమర రాజా చైనా టెక్నాలజీ తీసుకురాలేకపోయింది. చైనా నిషేధం తరవాత ఇపుడు అదే టెక్నాలజీని సొంతంగా తయారు చేసేందుకు రెడీ అవుతోంది. దీని కోసం ఈ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత నిపుణులతో పనిచేస్తోంది. టెస్లా ఇంజినీర్లను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అనలిస్టులతో ఇటీవల జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో కంపెనీ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు. 2027 మధ్యకల్లా 2 GWhల NMC సెల్స్ తయారీకి రెడీ అవ్వాల్సింది. అయితే 2028 చివరల్లో రెడీ కావొచ్చని విక్రమాదిత్య అంచనా వేస్తున్నారు. ఎల్‌ఈపీ క్యాథోడ్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యం 99 శాతం కాగా, గ్రాఫైట్ అనోడ్ ప్రొడక్షన్‌లో కూడా చైనా వాటా 97 శాతం పైనే. చైనా నిర్ణయం వల్ల ఈ రంగంలోని అన్ని కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ కోసం సెల్ తయారీ అంశాన్ని కూడా తమ కంపెనీ చురుగ్గా పరిశీలిస్తోందని విక్రమాదిత్య తెలిపారు.
