For Money

Business News

పెట్రోల్‌, డీజిల్‌ బాదుడుకు రెడీ

ఈనెల 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికల కోసమని గత నవంబర్‌ నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం లేదు. ఈ నిర్ణయం తీసుకున్నపుడు బ్యారెల్‌ క్రూడ్‌ ధర 81.5 డాలర్లు ఉండేది. ఇపుడు 110కి చేరింది.అయితే కంపెనీల ముందస్తు అగ్రిమెంట్లు లెక్కలోకి తీసుకుంటే మార్చి 1వ తేదీ నుంచి క్రూడ్‌ బాస్కెట్‌ ధర బ్యారెల్‌కు 102 డాలర్లు పడనుంది. ఈ లెక్కన పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు రూ.9 చొప్పున పెంచాల్సి ఉంటుందని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు అంటున్నాయి. అయితే ప్రభుత్వం మొత్తం ధరను ఒకేసారి కాకుండా క్రమంగా పెంచుతుందని భావిస్తున్నారు. అలాగే ఎక్సైజ్‌ సుంకాన్ని కాస్త తగ్గించి… మిగిలిన భారం జనం వేస్తారని కూడా అధికార వర్గాలు అంటున్నాయి. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల తరవాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం ఖాయం. ఎంత అనేది తెలుసుకోవడానికి మరో వారం వేచి ఉండక తప్పదు.