For Money

Business News

అయినా… వడ్డీ రేట్లు పెంచుతాం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్నా… అమెరికా పరపతి విధానంలో మార్పు ఉండదని ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బోణం భారీగా పెరుగుతున్నందున వడ్డీ రేట్లు పెంచక తప్పదని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తలెత్తే ఆర్థిక అనివ్చితిని అంచనా వేయడం చాలా కష్టమని ఆయన అన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్‌ ఎదుట హాజరై దేశ ఆర్థిక పరిస్థితిని వివరించనున్నారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. మార్చి 15వ తేదీన తదుపరి
ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ఉంది.ఆ సమావేశంలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచుతారు. అయితే వడ్డీ రేట్లు శరవేగంగా పెంచుతారా? లేదా పరిస్థితిని బట్టి వ్యూహం మారుతుందా అన్న అంశంపై ఆయన కాంగ్రెస్‌కు ఎలాంటి అంచనా ఇవ్వలేదు.