For Money

Business News

జెట్‌ స్పీడుతో పెరిగిన క్రూడ్‌

ఏకాస్త తగ్గినా… ఏదో కారణంతో క్రూడ్‌ ఆయిల్ పెరుగుతోంది. మొన్నటి వరకు హరికేన్‌ కారణంతో పెరగ్గా.. ఇపుడు కూడా సరఫరా మునుపటి స్థాయికి రాకపోవడంతో.. వినియోగం తగ్గకపోవడంతో అమెరికాలో క్రూడ్‌ నిల్వలు తగ్గాయి. ప్రతి బుధవారం అమెరికా క్రూడ్‌నిల్వల డేటా వస్తుంది. మార్కెట్‌ అంచనాలకు మించి 24.4 లక్షల బ్యారెల్స్‌ మేరకు క్రూడ్‌ నిల్వలు తగ్గుతాయని అనలిస్టులు అంచనా వేయగా, 34.81 లక్షల బ్యారెల్స్‌ తగ్గాయి. దీంతో ఫ్యూచర్ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు భారీగా పెరిగాయి. అమెరికా మార్కెట్‌ ఉపయోగించే WTI క్రూడ్‌ బ్యారెల్‌ ధర 2 శాతం పెరిగి 71.97 డాలర్లకు చేరగా, ఆసియా దేశాలు వాడే బ్రెంట్‌ క్రూడ్‌ ధర కూడా 2 శాతం పెరిగి 75.87 డాలర్లకు చేరింది. డాలర్ స్వల్ప నష్టాలతో ఉండటంతో బులియన్‌ స్థిరంగా ఉంది. వెండి ఒకటిన్నర శాతం పెరిగినా… బంగారం ధరలో మార్పు లేదు. ఔన్స్‌ ధర 1778 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.