For Money

Business News

అంచనాలు అందుకోని నైకా

గత ఏడాది చివర్లో క్యాపిటల్‌ మార్కెట్‌లోప్రవేశించిన నైకా ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. గత డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 59 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 69 కోట్ల నికర లాభం ఆర్జించగా, ఈ త్రైమాసికంలో రూ. 27.9 కోట్ల నికర లాభం ఆర్జించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ పనితీరు బాగున్నా… మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో కంపెనీ విఫలమైంది. కంపెనీ కనీసం రూ. 36.2 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనాఆ వేశారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 1098 కోట్లకు చేరింది. ఆపరేటింగ్‌ లాభం కూడా రూ.70 కోట్లకు పెరిగింది.