For Money

Business News

లాభాల్లో బంగారం, వెండి

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలహీనడపటంతో బులియన్‌ ధరలు పెరుగుతున్నాయి. నిన్న రాత్రి డాలర్‌ ఇండెక్స్‌ 96 దిగువకు వచ్చేసింది. ఔన్స్‌ బంగారం ధర 1835డాలర్లను తాకగా, వెండి 23.20 డాలర్లకు చేరింది. బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడంతో కరెన్సీ మార్కెట్‌ వీక్‌గా మారింది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక మన మార్కెట్‌లో ఫ్యూచర్స్‌లో ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ రూ.241 లాభంతో రూ. 48670 వద్ద ముగిసింది. ఇక కిలో వెండి రూ.357లు పెరిగి రూ. 62724కు చేరింది. ఇక హైదరాబాద్‌ స్పాట్‌ మార్కెట్‌లో ఆర్నమెంట్‌ బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 45,550కు చేరింది. అదే స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 160 పెరిగి రూ. 49690 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వెండి రూ. 660 పెరిగి రూ. 62560 వద్ద ఉంది.