ఎన్నారైలు ఇక నేరుగా ఇక్కడి బిల్లులు కట్టొచ్చు
ఇప్పటి వరకు భారత వాసులకు మాత్రమే అందుబాటులో ఉన్న భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)ను ఇపుడు ఎన్నారైలకు కూడా అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. ఇక నుంచి ఎన్నారైలు ఏవైనా బిల్లులు చెల్లించాల్సి ఉంటే నేరుగా వారు BBPS ద్వారా చెల్లించవచ్చు. మనదేశంలో ఉన్న ఆస్తుల కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులతోపాటు తమవారి ఫోన్ బిల్లులను కూడా నేరుగా వారు విదేశాల నుంచే కట్టొచ్చు. అలాగే పిల్లల చదువుకు సంబంధించిన ఫీజులు.. ఇతర బిల్లులను కూడా భారత్లోని తమ కుటుంబాల తరఫున ఎన్నారైలు కట్టొచ్చు. బీబీపీఎస్ వద్ద నమోదైన అన్ని సంస్థల బిల్లులను ఆన్లైన్ ఎన్నారైలు కట్టొచ్చని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. విదేశీ కరెన్సీలో చెల్లింపులు ఉంటాయి కాబట్టి… కరెన్సీ విలువ ఎలా లెక్కగట్టాలి వంటి అంశాలతో పాటు ఇతర విధివిధాలను ఆర్బీఐ వెల్లడించాల్సి ఉంది.