For Money

Business News

నష్టాల్లో వాల్‌స్ట్రీట్.. ఎందుకంటే

ఉదయం నుంచి స్థిరంగా ఉన్న వాల్‌స్ట్రీట్‌ సూచీలు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీనికి ప్రధాన కారణం… జులై నెల జాబ్‌ డేటా చాలా పటిష్ఠంగా రావడమే. జులై నెలలో నాన్ ఫామ్‌ పే రోల్స్‌ 5,20,000 మేర పెరిగాయి. ఇది మార్కెట్‌ అంచనాల కన్నా ఎక్కువ. ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని దీనర్థం. పే రోల్‌ డేటా బాగుండటంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను అధికంగా పెంచుతుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇదే కారణంగా డాలర్‌ ఒక శాతంపైగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 106ను దాటింది. ఫలితంగా నాస్‌డాక్‌ ఒక శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.7 శాతం, డౌజోన్స్‌0.3 శాతం చొప్పున నష్టాలతో ట్రేడవుతున్నాయి. జాబ్‌ డేటా చాలా పాజిటివ్‌గా రావడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 1.5 శాతం చొప్పున పెరిగాయి. డాలర్‌ పెరగడంతో బులియన్‌ మార్కెట్‌ డల్‌గా మారింది. బంగారం ఒక శాతం, వెండి 1.6 శాతం చొప్పున నష్టంతో ట్రేడవుతున్నాయి.