For Money

Business News

భారత్‌లో ఐఫోన్‌ 14 సిరీస్‌ తయారీ

ఐఫోన్ 14 సిరీస్‌ను వచ్చే నెలలో యాపిల్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను కంపెనీ తెస్తోంది. ఇప్పటి వరకు ఐఫోన్లను చైనా ప్లాంట్లను నుంచి సమకూర్చుకుంటున్న యాపిల్‌ ఈసారి ఐఫోన్‌ 14 సిరీస్‌లో కొన్ని ఫోన్లను భారత్‌లో తయారు చేయనుంది. ఐటీ ఇండస్ట్రీ అనలిస్ట్ మింగ్ చి కువో ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు.
ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్లను ఫాక్స్‌కాన్ ఉత్పత్తి చేస్తోంది. ఇదే ప్లాంట్‌ నుంచి ఐఫోన్ 14 మోడళ్లను కూడా తయారు చేసి … ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయనుంది.