For Money

Business News

ఢిల్లీ వాసులకు షాక్‌: పీఎన్‌జీ ధర మళ్ళీ పెంపు

ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో అనేక నగరాల్లో పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) సరఫరా అవుతోంది. అనేక మంది ఇళ్ళలో ఇపుడు పీఎన్‌జీనే వాడుతున్నారు. ఎందుకంటే మోడీ అధికారంలో రాకముందు ఎల్‌పీజీ ధరలో పీఎన్‌జీ దాదాపు ధర సగం ఉండేది. పైగా సురక్షితం కూడా. ఇవాళ పీఎన్‌జీ యూనిట్‌ ధరను మరో రూ. 2.63 చొప్పున గ్యాస్‌ కంపెనీలు పెంచాయి. గత రెండు వారాల్లో గ్యాస్‌ ధర పెంచడం రెండోసారి. యూనిట్‌ అంటే ఒక స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ (standard cubic metres) తాజా పెంపుతో ఒక యూనిట్‌ ధర ఢిల్లీలో రూ.50.59కి చేరింది. అదే కాన్పూర్‌, ఫతేపూర్‌, హమిర్‌పూర్‌లలో యూనిట్‌ ధర రూ. 53.10 చేశారు. ఇక అజ్మీర్‌, పాలి, రాజసమంద్‌ ప్రాంతాల్లో ధర రూ.56.23కి చేరింది.
మోడీ డబుల్‌
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు పీఎన్‌జీ ఒక యూనిట్‌ రూ.24.50 ఉండేది. 2016లో కూడా ఒక తక్కువ గ్యాస్‌ వాడే కుటుంబాలకు (స్లాబ్‌ వన్‌లోఉన్నవారికి) ఒక యూనిట్‌ రూ. 21.96కి సరఫరా చేసేవారు. ఇపుడు ఢిల్లీలో రూ. 50.59, ఇతర నగరాల్లో రూ. 56.23కి చేరింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.