For Money

Business News

IT Returns: గడువు పెంచడం లేదు

2021-22 అసెస్‌మెంట్‌ ఏడాదికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఇవాళే చివరి తేదీ. రిటర్న్‌లు దాఖలు చేసేందుకు గడువు పెంచే ప్రతిపాదన తమ వద్ద లేదని రెవెన్యూ కార్యదర్శి స్పష్టం చేశారు. పన్ను వేయదగ్గ ఆదాయం రూ. 5 లక్షలు దాటి, అయినా గడువు లోపల ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయకపోతే రూ. 5000 జరిమానా కట్టాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఒకవేళ తాము అధిక పన్ను చెల్లించి ఉంటే (ఐటీ రిటర్న్‌ దాఖలు చేయకపోతే)… మున్ముందు అసెస్‌మెంట్ ఏడాదికి నష్టాలు, వడ్డీలను అడ్జస్ట్ చేసే ప్రయోజనం కోల్పోతారని అధికారులు తెలిపారు.