For Money

Business News

GST రిటర్న్‌ల దాఖలు గడువు పెంచారు

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను జీఎస్‌టీ వార్షిక రిటర్నులు సమర్పించేందుకు గడువును ఈ డిసెంబరు 31 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే, వ్యాపారులకు జీఎస్‌టీఆర్‌-9, జీఎస్‌టీఆర్‌-9సీ సమర్పించేందుకు రెండు నెలల అదనపు గడువు లభించింది. రూ.2 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు జీఎస్‌టీ వార్షిక రిటర్ను (జీఎస్‌టీఆర్‌-9) సమర్పించడం తప్పనిసరి. రూ.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ కలిగిన వారు మాత్రమే స్వీయ ధ్రువీకరణతో కూడిన రికాన్సిలేషన్‌ స్టేట్‌మెంట్‌ (జీఎస్‌టీఆర్‌-9సీ) సమర్పించాల్సి ఉంటుంది.