అదానీ కేసు: సీబీఐ విచారణకు నో
అదానీ -హిండెన్‌బర్గ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో అదానీ గ్రూప్‌నకు ఊరట లభించింది. గత విచారణ సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన అంశాలనే ఇవాళ కోర్టు పునరుద్ఘాటించింది. సెబీ దర్యాప్తును అనుమానించలేమని అంటూనే… ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలన్న వాదనను కొట్టేసింది. ప్రస్తుత సెబీ దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయితే ఈ కేసులో ఇంకా మిగిలిన అంశాల్లో విచారణను మూడు నెలల్లో ముగించాలని సెబీకి సుప్రీం కోర్టు ఆదేశించింది. హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల విచారణను సెబీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. షేర్ మార్కెట్లో హిండెన్‌బర్గ్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ‘షార్టింగ్’ చేసిందా లేదా అన్న అంశాలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది.